Back

Choose Song To View The Lyrics

మేఘంబుపై నెక్కి మేలుగ ప్రభు క్రీస్తు

మేఘంబుపై నెక్కి మేలుగ ప్రభు క్రీస్తు యాకసంబున కేగెను
ప్రాకటముగను ఆత్మనంది ప్రజ్ఞ మీరగ సాక్ష్యమిచ్చి యేక దీక్షను యేసు
రాకకు నెదురు జూడుడటంచు ప్రభువు
||మేఘంబు||

1. యూదయ్య సమరయ్య ప్రాంతంబులంతట నాదు వార్తను జాటరే
భూదిగంతము వరకు మీరు భూరి సాక్షులగుచు నాకు సాదరంబుగ సత్య
విశ్వా సంబులన్ మనుడంచు ప్రభువు
||మేఘంబు||

2. గలిలయ్యులార మీ రాశతో నెందుకు తిలకించు చున్నారట్లు
వెలయపరమున కెట్లు నేగెనొ యిలకు నా ప్రభువట్లెమరల యలర వచ్చుట
మీరు గాంచెద రంచు దూతలు బల్కిరపుడె
||మేఘంబు||

3. శ్రీ సంఘ మిదివిను మా యేసు ప్రభు క్రీస్తే భాసిల్ల మఱి వచ్చును
యేసు ప్రభుని యడుగు జాడల యేపు మీరగ నడచు కొనుచు నీసు
రక్షణ నిలకుజాటుచు నెదురు జూడుము యేసు కొఱకే
||మేఘంబు||
** TELUGU LYRICS **

** ENGLISH LYRICS **

Meghambupai Nekki Meluga Prabhu Kreestu Yaakasambuna Kegenu
Praakatamuganu Aathmanandhi Prajna Meeraga Saakshyamichchi Yeka Deekshanu Yesu
Raakaku Nedhuru Joodudatanchu Prabhuvu
||Meghambupai||

1. Yoodhayya Samarayya Praanthambulanthata Naadhu Vaarthanu Jaatare
Bhoodhiganthamu Varaku Meeru Bhoori Saakshulaguchu Naaku Saadharambuga Sathya
Vishwaa Sambulan Manudanchu Prabhuvu
||Meghambupai||

2. Galilayyulaaraa Meeraashatho Nendhuku Thilakinchu Chunnaarattlu
Velayaparamuna Ketlu Negeno Ilaku Naa Prabhuvatlemarala Yalara Vachchuta
Meeru Ganchidha Ranchu Doothalu Balkirapude
||Meghambupai||

3. Shree Sangham Idhivinu Maa Yesu Prabhu Kreesthe Bhaasilla Mari Vachchunu
Yesu Prabhuni Yadugu Jaadala Yepu Meeraga Nadachu Konuchu Neesu
Rakshana Nilakujaatuchu Nedhuru Joodumu Yesu Korake
||Meghambupai||

-------------------------------------------------------------------
CREDITS :
-------------------------------------------------------------------