Back

Choose Song To View The Lyrics

చూడరే సిలువను వ్రే లాడు యేసయ్యను

చూడరే సిలువను వ్రే-లాడు యేసయ్యను
పాడు లోకంబునకై – గోడు జెందె గదా
||చూడరే||

నా చేతులు చేసినట్టు – దోషంబులే గదా
నా రాజు చేతులలో ఘోరంపు జీలలు
||చూడరే||

దురితంపు దలఁపులే – పరమ గురిని శిరముపై
నెనరు లేక మొత్తెనయ్యొ – ముండ్ల కిరీటమై
||చూడరే||

పరుగెత్తి పాదములు – చేసిన పాపంబులు
పరమ రక్షకుని – పాదములలో మేకులు
||చూడరే||

పాపేఛ్చ తోడ గూడు – నాడు చెడ్డ పడకలే
పరమ గురుని ప్రక్కలోని – బల్లెంపు పోటులు
||చూడరే||

-------------------------------------------------------------------------
CREDITS : ఒంగోలు అబ్రాహాము (Ongole Abraham)
-------------------------------------------------------------------------
** TELUGU LYRICS **

** ENGLISH LYRICS **

Choodare Siluvanu Vre-laadu Yesayyanu
Paadu Lokambunakai – Godu Jende Gadaa
||Choodare||

Naa Chethulu Chesinatti – Doshambule Gadaa
Naa Raaju Chethulalo Ghorampu Jeelalu
||Choodare||

Durithampu Dalapule – Parama Gurini Shiramupai
Nenaru Leka Motthenayyo – Mundla Kireetamai
||Choodare||

Parugetthi Paadamulu – Chesina Paapambulu
Parama Rakshakuni – Paadamulalo Mekulu
||Choodare||

Paapechcha Thoda Goodu – Naadu Chedda Padakale
Parama Guruni Prakkaloni – Ballempu Potulu
||Choodare||