Back

Choose Song To View The Lyrics

చల్లని స్వరమే మెల్లగా పలికెను

చల్లని స్వరమే మెల్లగా పలికెను
తన సన్నిధిలో జోలలు పాడెను (2)
లాలి లాలి యేసు ఒడిలో లాలి
దూతల స్తోత్రవళి నిదురలో నినుఁచాలి (2)
||చల్లని స్వరమే||

మా నవ్వుల పంట! దేవుని వరమే నీవు
ప్రార్థన ఫలితంగా మా బ్రతుకులో పండావు (2)
నిదురలో కలల అలలపై తెలిపోతున్నావా
కను రెప్పలపై ఎగిరి ప్రభుతో ఆటలాడుతున్నావా (2)
||లాలి లాలి||

ప్రభు పనిలోన పాత్రగా నువ్వు వెలగాలి
తన ప్రేమను చాటే సాక్ష్యములను పొందాలి (2)
అలసట కరుగులాగా ఆదమరచి నిదురపో
ప్రభు దయతో నువ్వెదిగి తనతో అలుపెరుగక సాగిపో (2)
||లాలి లాలి||
** TELUGU LYRICS **

** ENGLISH LYRICS **

-------------------------------------------------------------------
CREDITS :
-------------------------------------------------------------------