Back

Choose Song To View The Lyrics

చక్కని బాలుడమ్మ చూడచక్కంగా ఉన్నాడమ్మ

చక్కని బాలుడమ్మ - చూడచక్కంగా ఉన్నాడమ్మ (2)
కన్నీయ మరియమ్మ ఒడిలోన - భలే బంగారు బాలుడమ్మ (2)
||చక్కని||

గొల్లలంతా గొప్ప దేవుడంటు - కూడినారు పశులపాకలో
జ్ఞానులంతా తూర్పు చుక్కచూస్తూ - చేరినారు బేత్లహేములో (2)
బంగారు సాంబ్రాణి భోళములు - అర్పించి ఆరాధించిరి
లోక రక్షకుడు మా రారజని - కీర్తించి కొనియాడిరి
||చక్కని||

నింగిలోన పరిశుద్దులంతా - ప్రభువుని స్తుతించిరి
బెత్లహేము పురములోన - భక్తులంతా పూజించిరి (2)
సర్వోన్నతమైన స్థలములలోన - దేవునికే మహిమ
అని దూతలంతా దివిలోన - పరవశించి పాడిరి
||చక్కని||

------------------------------------------------------------------------------
CREDITS : Dr. P Sathish Kumar (డా. పి సతీష్ కుమార్)
------------------------------------------------------------------------------
** TELUGU LYRICS **

** ENGLISH LYRICS **