Back

Choose Song To View The Lyrics

చాలయ్యా చాలయ్యా నీ కృప చాలయ్యా మేలయ్యా మేలయ్యా నా కదియే మేలయ్యా

చాలయ్యా చాలయ్యా నీ కృప చాలయ్యా
మేలయ్యా మేలయ్యా నా కదియే మేలయ్యా
నీ కృపయే చాలయ్యా నాకదియే మేలయ్యా
నీ దయనే చూపయ్య నాకదియే ఘనతయ్యా

ప్రార్థించు వారికి కృప చూపుటకు
ఐశ్వర్యవంతుడవు నీవే యేసయ్యా
దుఃఖించువారికి ఉల్లాస వస్త్రమును
దయచేయు దేవుడవు నీవే యేసయ్యా
ప్రేమించి మన్నించి రక్షించువాడవు
కరుణించి కృపచూపి కాపాడువాడవు
నీ కృపయే చాలయ్యా

దీనాత్ములకు దయచూపుటకు
కరునసంపన్నుడవు నీవే యేసయ్యా
నిత్యమైన కృపతో వాత్సల్యము చూపి
సమకూర్చు వాడవు నీవే యేసయ్యా
ఓదార్చి బలపరచి నడిపించువాడవు
దీవించి ఘనపరచి హెచ్చించువాడవు
నీ కృపయే చాలయ్యా
** TELUGU LYRICS **

** ENGLISH LYRICS **

---------------------------------------------------------------------------------
CREDITS : Music : Sudhakar Rella
Lyrics & Vocals : Amara Kumari & Lillian Christopher
---------------------------------------------------------------------------------