Back

Choose Song To View The Lyrics

చాచిన చేతులతో ఎదురు చూచుచుండెను

చాచిన చేతులతో ఎదురు చూచుచుండెను
వేచిన నీ తండ్రి కనులు నిదుర ఎరుగకయుండెను
ఓ చిన్ని తనయా నీకెన్ని శ్రమలేలనయా
నీ తండ్రి ప్రేమను గనవా
నీ ఇంటికే తిరిగి రావా
||చాచిన||

పనివారు సయితం నీ తండ్రి ఇంట
రుచియైన అన్నం తినుచుండగా
కనికరము చూపే వారెవ్వరు లేక
శుచిలేని పొట్టుకై ఆశించితివా
||చాచిన||

నీ క్షేమమును కోరు నీతండ్రి నొదిలి
ఆ క్షామ దేశమున జీవింతువా
విస్తార ఆస్థిపై అధికారమును విడిచి
కష్టాల బాటలో పయనింతువా
||చాచిన||

పరిశుధ్ధ తండ్రికి ప్రియ సుతునివైయుండి
పందులతో నీకు సహవాసమా
ఏర్పరచబడిన యువరాజువైయుండి
పనికిమాలిన వారితో స్నేహమా

||చాచిన||
** TELUGU LYRICS **

** ENGLISH LYRICS **

-------------------------------------------------
CREDITS : Bro. A.R. Stevenson
-------------------------------------------------