Back

Choose Song To View The Lyrics

చల్ల చల్లని గాలి తెమ్మెర హో...హో... హో...

- జి.పి.శ్రీకాంత్
- Scale : Em

చల్ల చల్లని గాలి తెమ్మెర
హో...... హో...... హో......
కొండ కోనల్లో ఝమ్మని పాడగ
మెల్ల మెల్లగ పారే సెలయేరు
పరవళ్లు త్రొక్కుచు ఉప్పొంగి ఆడగ
పుడమి తనువు పులకించింది
ఇలలో యేసురాజు పుట్టెనని
||చల్ల||

1. లోకమంత పాపముతో నిండి యుండగా
ప్రేమించి పరలోకము వీడి
భూజన దోషములు తనపైన మోసుకొని (2)
మ్రానుపైన మరణించుట కేతెంచినాడని
||చల్ల||

2. పునరుత్థానుడై మృత్యుంజయునిగా
మహిమాత్ముండై ఇలలో నిలచి
విశ్వసించినచో దోషములు క్షమియించి (2)
నిత్యజీవ మొసగుటకు ఈభువి కేతెంచెనని
||చల్ల||

3. మేఘ వాహనుడై సింహగర్జనతో
వేవేల దూతలతో ఏగి
నూతన యెరుషలేము ధరపైన స్థాపించి (2)
నీతి న్యాయములతోడ తననేల బోవునని
||చల్ల||

చల్ల చల్లని గాలి తెమ్మెర
Em D Em
హో...... హో...... హో......
Am Em
కొండ కోనల్లో ఝమ్మని పాడగ

మెల్ల మెల్లగ పారే సెలయేరు
Am Em
పరవళ్లు త్రొక్కుచు ఉప్పొంగి ఆడగ
Am
పుడమి తనువు పులకించింది
Em
ఇలలో యేసురాజు పుట్టెనని

||చల్ల||

1. లోకమంత పాపముతో నిండి యుండగా

ప్రేమించి పరలోకము వీడి
A D A
భూజన దోషములు తనపైన మోసుకొని (2)
Em C Em
మ్రానుపైన మరణించుట కేతెంచినాడని
||చల్ల||

2. పునరుత్థానుడై మృత్యుంజయునిగా
మహిమాత్ముండై ఇలలో నిలచి
విశ్వసించినచో దోషములు క్షమియించి (2)
నిత్యజీవ మొసగుటకు ఈభువి కేతెంచెనని
||చల్ల||

3. మేఘ వాహనుడై సింహగర్జనతో
వేవేల దూతలతో ఏగి
నూతన యెరుషలేము ధరపైన స్థాపించి (2)
నీతి న్యాయములతోడ తననేల బోవునని
||చల్ల||
** TELUGU LYRICS **

** CHORDS **

Em D

** ENGLISH LYRICS **

---------------------------------------------------
CREDITS : Vidhyardhi Geethavali
---------------------------------------------------