Choose Song To View The Lyrics
ఇదిగో నా జీవితం దేవా నీకంకితం
ఇదిగో నా జీవితం దేవా నీకంకితం
బ్రతుకైనా చావైనా నీకోసమే
నాకున్నది నీవొక్కడివే
నే బ్రతికేందుకు నీ ప్రేమ చాలయ్యా
ఆరాధింతును నా పూర్ణ హృదయముతో
నిన్ను ఘనపరతును నా జీవితాంతము
యేసయ్య… యేసయ్య… యేసయ్య…
నా యేసయ్య యేసయ్య యేసయ్య…
1. నీ వైపే నే చూడక నీ ప్రేమే నేనెరుగక
శిథిలమైన శిలనై నేనుండగా (2)
నన్ను ప్రేమింపగా వెంటాడితివి
నీ కౌగిట చేర్చి మనిషిగా మార్చితివి (2)
ఎన్నాళ్ళుగా నాకై వేచియున్నావు
ఎందుకని ఇంత ప్రేమించితివి (2) ||ఇదిగో నా||
2. దివ్యమైన స్నేహము నా మదిలో నీ కావ్యము
పరిమళించు పద్మము నీవేనయ్యా (2)
ఊహల రేఖలకు ఊపిరి పోసితివి
ఊహకు మించిన స్థానమునిచ్చితివి (2)
ఏమి చూచితివి యోగ్యత నాలో
ఏమిచ్చి నీ ఋణము నే తీర్చెదను (2) ||ఇదిగో నా||
3. స్తుతులపై ఆసీనుడా పరిశుద్ధులలో మహనీయుడా
స్వరమండలము సితారతో కీర్తింతును (2)
సద్గుణములకు నిలయము నీవే
సర్వాధిపతులకు సారధి నీవే (2)
దైవములనబడిన వారికి నీవే
దేవుడవు మహా దేవుడవు.. (2) ||ఇదిగో నా||
బ్రతుకైనా చావైనా నీకోసమే
నాకున్నది నీవొక్కడివే
నే బ్రతికేందుకు నీ ప్రేమ చాలయ్యా
ఆరాధింతును నా పూర్ణ హృదయముతో
నిన్ను ఘనపరతును నా జీవితాంతము
యేసయ్య… యేసయ్య… యేసయ్య…
నా యేసయ్య యేసయ్య యేసయ్య…
1. నీ వైపే నే చూడక నీ ప్రేమే నేనెరుగక
శిథిలమైన శిలనై నేనుండగా (2)
నన్ను ప్రేమింపగా వెంటాడితివి
నీ కౌగిట చేర్చి మనిషిగా మార్చితివి (2)
ఎన్నాళ్ళుగా నాకై వేచియున్నావు
ఎందుకని ఇంత ప్రేమించితివి (2) ||ఇదిగో నా||
2. దివ్యమైన స్నేహము నా మదిలో నీ కావ్యము
పరిమళించు పద్మము నీవేనయ్యా (2)
ఊహల రేఖలకు ఊపిరి పోసితివి
ఊహకు మించిన స్థానమునిచ్చితివి (2)
ఏమి చూచితివి యోగ్యత నాలో
ఏమిచ్చి నీ ఋణము నే తీర్చెదను (2) ||ఇదిగో నా||
3. స్తుతులపై ఆసీనుడా పరిశుద్ధులలో మహనీయుడా
స్వరమండలము సితారతో కీర్తింతును (2)
సద్గుణములకు నిలయము నీవే
సర్వాధిపతులకు సారధి నీవే (2)
దైవములనబడిన వారికి నీవే
దేవుడవు మహా దేవుడవు.. (2) ||ఇదిగో నా||