Back

Choose Song To View The Lyrics

అద్వితీయుడా దేవా సత్యవంతుడా

అద్వితీయుడా దేవా సత్యవంతుడా
పూజ్యనీయుడా తండ్రీ పరిపూర్ణుడా
మహిమాన్వితుడా నీవే మహోన్నతుడా
శ్రీమంతుడా దేవా నా యేసయ్యా
ఘనపరతును, కీర్తింతును, కొనియాడెదా
పాదాలపై అత్తరునై ముద్దాడేదా
ఆరాధన నీకే ఆరాధనా నీకే

నా వేదనలో నా శోధనలో
నా రోదనలో అవరోధములో
నా అక్కరలో అవమానములో
నా శ్రమలలో పలుబాధలలో
నను వీడని ఎడబాయని నా దేవుడా
కనుపాపగా నీ కౌగిట దాచావుగా
ఆరాధన నీకే ఆరాధనా నీకే...

నీ సన్నిధియే ఆశ్రయపురము
నీ సముఖములో అమితానందం
నీ సహవాసం నాదు ధైర్యము
నీ సంకల్పం ఆశీర్వాదం
వెనుదిరుగను నిను మరువను నా యేసయ్యా
తుదిమట్టుకు జీవించెద నీ సాక్షిగా
ఆరాధన నీకే ఆరాధనా నీకే...
ఆరాధన నీకే ఆరాధనా నీకే...
ఆరాధన నీకే ఆరాధనా నీకే...
** TELUGU LYRICS **

** ENGLISH LYRICS **

-------------------------------------------------------------------
CREDITS :
-------------------------------------------------------------------