Back

Choose Song To View The Lyrics

అడగక మునుపే నా అక్కరలన్నియు ఎరిగిన వాడవు

అడగక మునుపే నా అక్కరలన్నియు ఎరిగిన వాడవు
అడిగిన వాటికంటే అత్యధికముగా చేయుచున్నావు
యేసయ్యా నీ కృప పొందుటకు నాలో ఏమున్నదని?

నాకు సహాయము చేయుటకై - నీ దక్షిణ హస్తము చాపితివే
సత్య సాక్షిగా నేనుండుటకై - ఉపకారములెన్నో చేసితివే
హల్లెలూయ - ఉపకారములెన్నో చేసితివే
||అడగక||

నాకు దీర్గాయువునిచ్చుటకే - నీ హితోపదేశము పంపితివే
నిత్యజీవము నేపొందుటకు పునరుత్థానము నొందితివే
హల్లెలూయ - పునరుత్థానము నొందితివే
||అడగక||

నాకు ఐశ్వర్యమునిచ్చుటకే నీ మహిమైశ్వర్యము విడిచితివే
మహిమలో నీతో నేనుండుటకే మహిమాత్మతో నన్ను నింపితివే
హల్లెలూయ - మహిమాత్మతో నన్ను నింపితివే
||అడగక||

-------------------------------------------------------------------------
CREDITS : హోసన్నా మినిస్ట్రీస్ (Hosanna Ministries)
-------------------------------------------------------------------------
** TELUGU LYRICS **

** ENGLISH LYRICS **