అందమైన దేశము పరలోకము (సీయోను పిల్లల పాటలు) . Andamaina Deshamu Paralokamu

పరలోకరాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడియున్నది… మత్తయి 13:11

పల్లవి : అందమైన దేశము పరలోకము

ఆనందముగా ఉంటుంది చిరకాలము(2)

1. పాపముండదు – అచట శాపముండదు

    దుఃఖముండదు – అచట చీకటుండదు(2)

    ఆహా మా యేసు రాజుగా – చిరకాల మేలుతాడు (2) ॥అంద॥

2. దూతలుంటారు – జీవ గ్రంథముంటుంది

    భక్తులుంటారు – జీవ వృక్షముంటుంది

    ఆహా మాయేసు రాజుగా – చిరకాల మేలుతాడు       ॥అంద॥

పాత క్రొత్త నిబంధనలందున (సీయోను పిల్లల పాటలు) / Patha krotha nibandanalanduna

… వచనముల భావము వారికి తెలిపెను. లూకా 24:27

1. పాత క్రొత్త నిబంధనలందున – అరవైయారు పుస్తకముల్

    పేర్లు తెలియవలెననిన – దైవ కృపచే విభజించి పాడ వలయున్

2. పాత నిబంధన యందలి గ్రంథముల్-ముప్పది తొమ్మిదియు

    మరి క్రొత్త నిబంధన – యందున ఇరవై-ఏడు పుస్తకములును

3. ఆదికాండము, నిర్గమకాండము, లేవీయుల కాండము,

    సంఖ్యా, ద్వితీయోపదేశ కాండముల్, యెహోషువ,

    న్యాయాధి పతులు, రూతు

4. మొదటి సమూయేలు, రెండు సమూయేలు

    మొదటి రెండు రాజులును

    మరి ఒకటి రెండు దినవృత్తాంతములును, ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేరు,

5. యోబు, కీర్తనలు, సొలొమోను సామెతల్, ప్రసంగి, పరమ గీతము

    యెషయా, యిర్మీయా, విలాపములు, యెహెజ్కేలు,

    దానియేల్, హోషేయా, యోవేలు,

6. ఆమోసు, ఓబద్యా, యోనా, మీకా, నహూము, మరి హబక్కూకు,

    జెఫన్యా, హగ్గయి, జెకర్యా, మలాకీ, చెప్పితి ముప్పై తొమ్మిది

7. మత్తయి, మార్కు, లూకా, యోహాన్, అపొస్తలుల కార్యములు,

    రోమా, ఒకటి, రెండు కొరింథీయులు, గలతీయ, ఎఫెసీయులు

8.  ఫిలిప్పీయు, కొలొస్సయు, ఒక థెస్సలోనికైయ,

    రెండు థెస్సలోని కైయులు

    ఒకటి, రెండు తిమోతి పత్రికలును – తీతు, ఫిలేమోన్ పత్రిక,

9. హెబ్రీయులును, యాకోబు, పేతురు – ఒకటి, రెండు పత్రికలన్

    యోహాను వ్రాసిన పత్రికలు మూడును – యూదా, ప్రకటనయు

10. అరవై ఆరును దేవుని చేత – నీయబడిన వేదము

     దాని మోకాళ్ళ మీద ప్రార్థన తోడ – అనుదినము చదువుడి

స్వీకరించుము విశ్వాసముతో (సీయోను పిల్లల పాటలు) / Sweekarinchumu vishwasamtho

…అయితే ఆత్మ ఫలమేమనగా,… గలతీ 5:22

స్వీకరించుము విశ్వాసముతో – పాపక్షమాపణ రక్షణను     (1)

పరిశుద్ధాత్మను పొందిన నీవు – ఆత్మ ఫలము ఫలించుము (1)

ఆత్మఫలములో తొమ్మిది – రుచులున్నవి గమనించుము     (1)

ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము                                (2)

దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము (1)

ఆశానిగ్రహము                                                                                  (2)

విత్తనాలు విత్తుటకు విత్తువాడు బయలుదేరెను  (సీయోను పిల్లల పాటలు)/ Vithanalu vithutaku Bayaluderenu

విత్తువాని గూర్చిన ఉపమాన భావము వినుడి… మత్తయి 13:18

పల్లవి : విత్తనాలు విత్తుటకు విత్తువాడు బయలుదేరెను        (2)

అవి విత్తుచుండగా కొన్ని త్రోవ ప్రక్క పడెను             (2)

పక్షులు వచ్చి వాటిని మ్రింగివేసెను                                (2)

1.మరికొన్ని విత్తనాలు – రాతినేల మీద పడెను         (2)

    వాటిలో వేరు లేనందున – అవి ఎండిపోయెను      (2)      ॥విత్త॥

2. మరికొన్ని విత్తనాలు – ముండ్లపొదలలోన పడెను

    ముండ్ల పొదలు ఎదిగి – వాటి నణచి వేసెను                        ॥విత్త॥

3. మరికొన్ని విత్తనాలు – మంచి నేల మీద పడెను

    ముప్ప – దరువదంతల్ – నూరంతలు ఫలియించెన్          ॥విత్త॥

4. వాక్యమును విని, గ్రహించి – దాని ననుసరించువారు

    సఫలులై ప్రభు యేసులో – బహుగా ఫలించెదరు                ॥విత్త॥

సిద్ధపడుము – దేవుని సేవకై (సీయోను పిల్లల పాటలు) Siddhapadumu Devuni Sevakai

…నా సేవకుడు నేను ఏర్పరచుకొనినవాడు… యెషయా 42:1

సిద్ధపడుము – దేవుని సేవకై (2) నిన్నేర్పరచుకొనె – దేవుడు                (1)

నీతో నిలిచి – నీకు తోడైయుండున్-లేచి నడువుము దేవునితో         (2)

సిరియా దేశపు సైన్యాధి పతి(సీయోను పిల్లల పాటలు)/ Siriya Deshapu Sainyadhipathi

…అతని దేహము పసిపిల్ల దేహమువలెనై అతడు శుద్ధుడాయెను. 2 రాజులు 5:14

పల్లవి : సిరియా దేశపు సైన్యాధి పతి శూరుడు నయమాను (2)

అయినను అతడో కుష్టరోగి, అదియే విచారం (1)

అతనికి అదియే విచారం(1)

1.ఎన్నో మందులు తిన్నాడు – ఎన్నో పూజలు చేశాడు

    అయినను రోగము తగ్గకపోయెను – అదియే విచారం (1)

    అతనికి అదియే విచారం (1)                                    ॥సిరియా॥

2. ఇశ్రాయేలు చిన్నది చెప్పిన – సువార్త విన్నాడు (1)

    అతడు సువార్త విన్నాడు (1)

    ఎలీషా యొద్దకు వేగమే వెళ్ళి విన్నతి చేశాడు

    అతడు విన్నతి చేశాడు (1)                                                         ॥సిరియా॥

3. యోర్దాను నదిలో ఏడుమార్లు ఎంచి మునిగాడు

    అతడు ఎంచి మునిగాడు

    శుద్ధుడై పరిశుద్ధ దేవుని మహిమపరచాడు

    అతడు మహిమపరచాడు                                                          ॥సిరియా॥

4. ఆలాగే ఈ పాపమనెడి పాడురోగంబే

    అది పాడురోగంబే

    యేసు రక్తములో కడుగబడినచో శుద్ధులయ్యెదరు

    ఆహా శుద్ధులయ్యేదరు                                                                 ॥సిరియా॥

మాటలు లేని పుస్తకాన్ని మరువకండి పిల్లలు (సీయోను పిల్లల పాటలు)/ Maatalu Leni Pusthakamulu Maruvakandi Pillalu

…యేసుక్రీస్తు అనుగ్రహించు… జ్ఞానమందును అభివృద్ధిపొందుడి. 2 పేతురు 3:18

పల్లవి : మాటలు లేని పుస్తకాన్ని మరువకండి పిల్లలు(2)

మనసార ధ్యానించుడి రంగులలోన నన్ను(2)

1.బంగారం – పరలోకమునకు గురుతు

   పిల్లల్లాంటి వారిదే పరలోకమనే ప్రభువు(2)          ॥మాట॥

2. నలుపు – పాపమునకు గురుతు

    పాపము వలన జీతము మరణము                          ॥మాట॥

3. ఎరుపు – యేసు రక్తమునకు గురుతు

    ప్రతి పాపము నుండి – పవిత్రులుగా చేయును॥మాట॥

4. తెలుపు – పరిశుద్ధతకు గురుతు

    హృదయ శుద్ధి కలవారే – దేవుని చూచెదరు॥మాట॥

5. ఆకుపచ్చ – ఎదుగుదలకు గురుతు

    వాక్యము ధ్యానించి – ఎదుగుదము రారండి॥మాట॥

యెహోషువా యౌవ్వనుడు – మోషేకు పరిచారకుడు (సీయోను పిల్లల పాటలు) / Yehoshua yavvanudu moshe ku paricharakudu

… నేనును నా యింటివారును యెహోవాను సేవించెదము … యెహోషువ 24:15

పల్లవి : యెహోషువా యౌవ్వనుడు – మోషేకు పరిచారకుడు (2)

కుడియెడమలకు తిరుగక ప్రభునే (2) వెంబడించిన సైనికుడు (2)

1. యోర్దానును దాటెను – యెరికోను కూలద్రోసెను(2)

    రాహాబును రక్షించి-ఆకానును శిక్షించి దైవనీతి నెరవేర్చెను (2)     ॥యె॥

2. గిబియోనుకై పోరాడుచు – యెహోవాను ప్రార్థించెను

    సూర్యచంద్రులను స్థంభింపజేసి – దైవశక్తి నిల చూపెను                 ॥యె॥

3. ఏడు జాతులను తరిమెను – ఇశ్రాయేలును చేర్చెను

    ప్రతిగోత్రానికి స్వాస్థ్యమునిచ్చి – దైవచిత్తమే చేసెను                            ॥యె॥

యేసయ్య ఎవ్వరో అని చూడగోరెనుఎంతో కోరికతో జక్కయ్య (సీయోను పిల్లల పాటలు)/ Yesayya Evvaro ani chudagorenu entho korikatho jakkayya

..జక్కయ్య… యేసు ఎవరోయని చూడగోరెను… లూకా 19: 2,3

పల్లవి : యేసయ్య ఎవ్వరో అని చూడగోరెను ఎంతో కోరికతో జక్కయ్య (2)

1. పొట్టివాడైనందున చుట్టు జనులున్నందున(2)

    తట్టే ఆలోచన ఎక్కె మేడిచెట్టు – చూచెను యేసయ్యను (2) ॥యే॥

2. జక్కయ్య త్వరగా దిగుము – నీ ఇంట నేనుందును

    ఎంతో సంతోషముతో తెరచె తన హృదయం

    పొందెను నిత్యజీవము                                                                       ॥యే॥

చిన్ని నావ నాది సాగిపోవుచున్నది(సీయోను పిల్లల పాటలు)/ Chinni Naava Naadi Saagipochunnadi

Our Vision:

Empowered by the holy spirit, the vision of our new Jerusalem ministries is to passionately spread the love and good news of Jesus Christ to our own communities, our country and to the ends of the earth as ambassadors for Jesus Christ.

మా దృష్టి :

తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ద్వారా అధికారం పొంది, నూతన యేరూషలేము పరిచర్యలు ద్వారా అనేకులను మన స్వంత సమాజాలకు, మన దేశానికి మరియు ప్రభువైన యేసుక్రీస్తునకు రాయబారులుగా భూదింగతముల వరకు యేసుక్రీస్తు ప్రేమను మరియు ఆయన శుభవార్తను ఉద్రేకపూర్వకంగా విస్తరించడం.

Our Mission:

We gather to glorify and praise God gloriously, to hear and respond obediently to what He has commanded.
We are apostles teaching one another in Jesus Christ. Come together in prayer, love, faith, obedience and compassion. 
We are committed to serving as ambassadors to tell others about Jesus Christ. 
we pursue God’s righteousness, justice, and peace in every place and time
Our ministry has no FCRA and no foreign funds. This is totally 100% Indian and indigenous ministry

మా మిషన్ :

మేము దేవునిని మహికరముగా ఘనపరచి, స్తుతించడానికి, ఆయన ఆజ్జాపించినవన్ని వినుటకును మరియు విధేయత కలిగి ప్రతిస్పందించడానికి సమావేశమవుతాము. 
మేము యేసుక్రీస్తు నందు ఒకరినొకరు అపోస్తులుల బోధ. ప్రార్థన, ప్రేమ, విశ్వాసం, విధేయత మరియు కరుణతో కలిసిమెలసియుందుము.
యేసుక్రీస్తును గురించి ఇతరులకు చెప్పడానికి రాయబారులుగా పనిచేయడానికి మేము కట్టుబడి ఉంటాము. 
మేము ప్రతి స్థలమునందు, సమయములలో దేవుని నీతి, న్యాయం, శాంతిని అనుసరిస్తాము 
ప్రార్థన టవర్లు, మ్యాగజైన్ల ద్వారా ఈ మిషన్ నెరవేరుతుంది.
నూతన యేరూషలేము పరిచర్యలు FCRA లేదు మరియు విదేశీ నిధులు లేవు. ఇది పూర్తిగా 100% భారతీయ మరియు స్వదేశీ పరిచర్యలు