Back

Choose Song To View The Lyrics

జీవిత యాత్రలో నా జీవన యాత్రలో

జీవిత యాత్రలో నా జీవన యాత్రలో
నే వెళ్ళే త్రోవలో నాకంటే ముందుగా (2)
నా తోడుగా నా నీడగా
నన్ను నడిపించును నజరేయుడు గలలేయుడు
||జీవిత యాత్రలో||

1. నా మార్గమందు మధ్యలో గాలి తుఫాను
సుడిగాలిలో చిక్కుకున్న నా నావను (2)
అలలపై నడచినాడు గాలి తుఫానునే అనచినాడు (2)
చుక్కాని తానై దరి చేర్చినాడు నా నావను
||జీవిత యాత్రలో||

2. గొఱ్ఱెవలె దారితప్పి తిరుగుచుండగ
వెదకి వెదకి వెంబడించి నను పట్టుకుని (2)
నాకై రక్తమిచ్చి నాకై ప్రాణమిచ్చి (2)
నా త్రోవకు వెలుగు చూపి నడిపించినాడు నా యింటికి
||జీవిత యాత్రలో||
** TELUGU LYRICS **

** ENGLISH LYRICS **

-------------------------------------------------------------------
CREDITS :
-------------------------------------------------------------------