Back

Choose Song To View The Lyrics

జీవము నీవే నాకై చావగ నాపాపంబది ఎంతో ఘోరం దేవా (72)

- జె. దేవరాజు
- Scale : C

జీవము నీవే నాకై చావగ - నాపాపంబది ఎంతో ఘోరం దేవా
తలచితిని వగచితిని - నను కరుణించుము నాధా దేవా (2)

1. పరిశుద్ధుడవు పావన చరితుడ - పలునింద పాలైనావా
ఖలుడను నేను కడు చంచలుడను - విలువైన నీ దేహం సిలువకు గొట్టితి
||జీవము||

2. నాతండ్రీ ఈ పాత్రను నానుండి - తొలగించండని వేడేవా
వేదన హెచ్చి నీమది కృంగి - దేహం చిందెనా స్వేదం రుధిరం
||జీవము||

3. నాదేవా నాదేవా నన్నేల - విడనాడితి వన్నావా
నాకలుషంబు కఠిన చీకటిగ - క్రమ్మెనా నిన్ను కలువరి లోన
||జీవము||

4. దప్పిగొనుచున్నానని పలికి - లేఖనమే నెరవేర్చావా
నా వ్యామోహం, దోషాదాహం - దీరని దాహమై నిను వేధించె

F C Bb C

C Bb C

** TELUGU LYRICS **

** CHORDS **

C Am C Bb C

** ENGLISH LYRICS **

---------------------------------------------------
CREDITS : Vidhyardhi Geethavali