Back

Choose Song To View The Lyrics

జీవాధిపతి నా యేసయ్య నా మంచి కాపరి

జీవాధిపతి నా యేసయ్య నా మంచి కాపరి
మరణపు ముళ్ళును విరిచిన నా రాజు నా యేసయ్య

1) కష్టాలలో కన్నీలలో నన్నాదరించితివే
శాంతి నొసగే నీ సన్నిధిలో నన్ను నిలుపుకుంటివే(2)
నీకేమి చెల్లింతును నా జీవితం అర్పింతును (2)
||జీవాధిపతి||

2) పాప ఊబిలో పడి యుండగ నను పైకి లేపితివి
రక్షణ నొసగే నీ రక్తముతో నన్ను కడిగితివి (2)
నీకేమి చెల్లింతును నా జీవితం అర్పింతును (2)
||జీవాధిపతి||

3) మరణ ఛాయలో నేనుండగా నన్ను బ్రతికించితివి
కరుణ చూపే నీ క్రుపతో నన్ను బలపరిచితివి (2)
నీకేమి చెల్లింతును నా జీవితం అర్పింతును (2)

||జీవాధిపతి||
** TELUGU LYRICS **

** ENGLISH LYRICS **

-------------------------------------------------------------------
CREDITS :
-------------------------------------------------------------------