Back

Choose Song To View The Lyrics

ఏనాడు ఎవ్వరు నీలాంటి ప్రేమను చూపించలేదే ఈ జగతిలో

ఏనాడు ఎవ్వరు - నీలాంటి ప్రేమను
చూపించలేదే - ఈ జగతిలో (2)
ప్రేమకు ప్రతిరూపం నీవే యేసయ్య
సిలువలో నా కోసం బలియై పోతివయా (2)

1. భరియింపజాలని - నా పాప భారముకై
సిలువనే మోయుచు - సోమ్మసిల్లి పోతివే (2)
కొరడాలు చెళ్ళని దేహాన్ని చీల్చినా(2)
భరియించినావయ్యా - ప్రేమా మయా(2)
ప్రేమకు ప్రతిరూపం నీవే యేసయ్య
సిలువలో నా కోసం బలియై పోతివయా (2)
ఏనాడు ఎవ్వరు - నీలాంటి ప్రేమను
చూపించ లేదే - ఈ జగతిలో

2. వేవేల దూతలతో - దివినేలు రాజువై
నను బ్రోవ ప్రేమతో - ధరకేగి దీనుడవై (2)
సొగసైన నీ రూపం కోల్పోయి నా కోసం(2)
మరణించినావయ్యా కరుణామయా (2)
ప్రేమకు ప్రతిరూపం నీవే యేసయ్య
సిలువలో నా కోసం బలియై పోతివయా (2)
ఏనాడు ఎవ్వరు - నీలాంటి ప్రేమను
చూపించ లేదే - ఈ జగతిలో

3. నీ రాజ్య పౌరునిగా - వారసత్వ మిచ్చుటకై
చిందించి నీ రుధిరం - రక్షించినావయ్యా (2)
ఏమిచ్చి నీ ఋణం నే తీర్చగలనయ్యా(2)
అర్పింతునయ్యా నా జీవితం (2)
ప్రేమకు ప్రతిరూపం నీవే యేసయ్య
సిలువలో నా కోసం బలియై పోతివయా (2)
ఏనాడు ఎవ్వరు - నీలాంటి ప్రేమను
చూపించ లేదే - ఈ జగతిలో
** TELUGU LYRICS **

** ENGLISH LYRICS **

--------------------------------------------------
CREDITS : Music : Vijay Suresh
Vocals : Karthik
---------------------------------------------------