Back

Choose Song To View The Lyrics

ఏ ముఖంబుతోడ వత్తు యేసు నాధనీదు మ్రోల

ఏ ముఖంబుతోడ వత్తు - యేసు నాధనీదు మ్రోల = కావరించి
నిన్నుమఱచి - యేక మైతి బామరులతో - నేది దారి నిన్నుఁ జేర
- నేమో తెలియదాయెను
||ఏ ముఖంబు||

నీచ పాప వర్తనంబు - పేచ మెల్లఁ బాపి ముందు = కాచి
పెంచి నియము నిష్ఠ - లాచరణము నిలుపుకొరకు - దోషర
మెల్ల బాపఁ - బూచినీ దె నిజముగా
||ఏ ముఖంబు||

తుట్టతుదకు నిన్ను జేరఁ - గట్టినాఁడం గంకణమును =
వట్టిమాటకాదు నిజము పట్టి - నడుపు పరమ పురికిఁ -
బట్టికొనుమునాదు చేయి - మట్టి పాలు కాకమునుపే
||ఏ ముఖంబు||
** TELUGU LYRICS **

** ENGLISH LYRICS **

-----------------------------------------------------------------
CREDITS : Andhra Kraisthava Keerthanalu
-----------------------------------------------------------------