Back

Choose Song To View The Lyrics

ఉన్న పాటున వచ్చు చున్నాను నీ పాద

- పురుషోత్తమ చౌదరి
- Scale : Bm

ఉన్నపాటున వచ్చు-చున్నాను నీ పాద సన్నిధి-కో రక్షకా
ఎన్న శక్యము గాని పాపము-లన్ని మోపుగ వీపు పైబడి
యున్న విదె నడలేక తొట్రిలు-చున్నవాడను నన్ను దయగను
||ఉన్న||

కారుణ్య నిధి యేసు – నా రక్షకా నీ శ-రీర రక్తము చిందుట
భూరి దయతో నన్ను నీ దరి – జేర రమ్మని పిలుచుటయు ని
ష్కారణపు నీ ప్రేమ యిది మరి – వేరే హేతువు లేదు నా యెడ
||ఉన్న||

మసి బొగ్గు వలె నా మా-నస మెల్ల గప్పె దో-ష సమూహములు మచ్చలై
అసిత మగు ప్రతి డాగు తుడువను – గసుటు గడిగి పవిత్ర పరపను
అసువు లిడు నీ రక్తమే యని – మాసల కిప్పుడు సిలువ నిదె గని
||ఉన్న||

వెలుపట బహు యుద్ధ-ములు లోపటను భయము – కలిగె నెమ్మది దొలాగెను
పలు విధములగు సందియంబుల – వలన పోరాటములచే నే
నలసి యిటునటు గొట్టబడి దు-ర్బలుడనై గాయములతో నిదె
||ఉన్న||

కడు బీద వాడ నం-ధుడను దౌర్భాగ్యుడను చెడిపోయి పడియున్నాను
సుడివడిన నా మదికి స్వస్థత – చెడిన కనులకు దృష్టి భాగ్యము
బడయ వలసిన వన్ని నీ చే – బడయుటకు నా యొడ యడా యిదె
||ఉన్న||

నీ వాగ్దత్తము నమ్మి – నీపై భారము పెట్టి – జీవ మార్గము గంటిని
కేవలంబగు ప్రేమ చేతను – నీవు నన్ను క్షమించి చేకొని
భావ శుద్ధి నొనర్చి సంతో-షావసరముల నిడుదువని యిదె
||ఉన్న||

దరిలేని యానంద-కరమైన నీ ప్రేమ – తరమే వర్ణన చేయను
తెరవు కడ్డం బైన యన్నిటి – విరుగ గొట్టెను గాన నే నిపు
డరుదుగా నీ వాడ నవుటకు – మరి నిజము నీ వాడ నవుటకే
||ఉన్న||

ఉన్నపాటున వచ్చు - చున్నాను నీ పాద - సన్నిధికోరక్షకా
A Bm

యెన్న శక్యము గాని పాపము - లన్ని మోపుగ వీపు పైబడియున్న
A Bm

విదె నడలేక తొట్రిలు - చున్నవాడను నన్ను దయగను

1. కారుణ్య నిధి యేసు - నా రక్షకా నీ శరీర రక్తము చిందుట - భూరి
దయతో నన్ను నీ దరిఁ - జేర రమ్మని పిలుచుటయు నిష్కారణపు
నీ ప్రేమ యిది మరి వేరే హేతువు లేదు నాయెడ
||ఉన్నత||

2. మసి బొగ్గువలె నా మా - నసమెల్ల గప్పెదో - ష సమూహములు
మచ్చలై - అసితమగు ప్రతి డాగు తుడవను గసటు గడిగి పవిత్ర
పరపను - నసువులిడు నీ రక్తమే యని మసలకిప్పుడు సిలువ నిదెగని
||ఉన్నత||

3. వెలపట బహు యుద్ధములు - లోపటను భయము గలిగే నెమ్మది
దొలగెను పలువిధముబులగు సందియంబుల - వలన బోరాటములచే
నే నలసి యిటునటుఁగొట్టబడి దు - ర్భలుడనై గాయములతో నిదె
||ఉన్నత||

4. కడు బీదవాడనం - ధుడను దౌర్భాగ్యుడను - జెడిపోయి పడి
యున్నాను - సుడివడిన నామదికి స్వస్థత - జెడిన కనులకు దృష్టి
భాగ్యముఁ - బడయవలసిన వన్ని నీచేఁ బడయుటకు నా యొడయడా యిదె
||ఉన్నత||
** TELUGU LYRICS **

** ENGLISH LYRICS **

Unnapaatuna Vachchu-chunnaanu Nee Paada – Sannidhiko Rakshakaa
Yenna Shakyamu Gaani Paapamu-lanni Mopuga Veepu Paibadi
Yunna Vide Nadaleka Thotrilu-chunnavaadanu nannu Dayaganu
||Unna||

Kaarunya Nidhi Yesu – Naa Rakshakaa Nee Sha-reera Rakthamu Chinduta
Bhoori Dayatho Nannu Nee Dari – Jera Rammani Piluchutayu Ni
Shkaaranapu Nee Prema Yidi Mari – Vere Hethuvu Ledu Naa Yeda
||Unna||

Masi Boggu Vale Naa Maa-nasa Mella Gappe Do-sha Samoohamulu Machchalai
Asitha Magu Prathi Daagu Thuduvanu – Gasutu Gadigi Pavithra Parapanu
Asuvu Lidu Nee Rakthame Yani – Masala Kippudu Siluva Nide Gani
||Unna||

Velupata Bahu Yuddha-mulu Lopatanu Bhayamu – Kalige Nemmadi Dolagenu
Palu Vidhamulagu Sandiyambula – Valana Poraatamulache Ne
Nalasi Yitunatu Gottabadi Du-rbhaludanai Gaayamulatho Nide
||Unna||

Kadu Beeda Vaada Na-ndhudanu Dourbhaagyudanu – Chedipoyi Padiyunnaanu
Sudivadina Naa Madiki Swasthatha – Chedina Kanulaku Drushti Bhaagyamu
Badaya Valasina Vanni Nee Che – Badayutaku Naa Yoda Yadaa Yide
||Unna||

Nee Vaagdhatthamu Nammi Neepai Bhaaramu Petti – Jeeva Maargamu Gantini
Kevalambagu Prema Chethanu – Neevu Nannu Kshaminchi Chekoni
Bhaava Shuddhi Nonarchi Santho-shaavasaramula Nidudhuvani Yide
||Unna||

Darileni Yaananda-karamaina Nee Prema – Tharame Varnana Cheyanu
Theravu Kadda Baina Yanniti – Viruga Gottenu Gaana Ne Nipu
Darudugaa Nee Vaada Navutaku – Mari Nijamu Nee Vaada Navutake

||Unna||

** CHORDS **

A Bm A Bm A Bm

** ENGLISH LYRICS **

Will Update Soon....

-------------------------------------------------------------
CREDITS :
-------------------------------------------------------------