Back

Choose Song To View The Lyrics

ఉదయించెను ఒక తార జగతిలో మనకోసమే మన రక్షణకై

ఉదయించెను ఒక తార జగతిలో
మనకోసమే మన రక్షణకై
వెలిగించెను మన హృదయమును
ఆ.. తారయే ప్రభుయేసే
ఆ రాత్రివేళలో ఆ పాశులశాలలో
జనియించెనేసు రక్షకునిగా
తూర్పుదేశపు జ్ఞానులు ఆ గొర్రెల కాపరులు
పూజించెను మనదేవుని యూదులకు రాజుగా

రక్షణ వచ్చెను వెలుగును తెచ్చెను
నిరీక్షణ కలిగెను ఈ లోకంలో
నిను ప్రేమించెను శాంతిని గెలిచెను
మనకొరకై జనియించెను యేసే

బంగారము సాంబ్రాణి బోళము
అర్పించెను మన యేసుకే
పరిశుద్ధుడే పాలోకనాధుడే
దిగివచ్చెను సాత్వికునిగా
ఆ రాత్రివేళలో ఆ పాశులశాలలో
జనియించెనేసు రక్షకునిగా
తూర్పుదేశపు జ్ఞానులు ఆ గొర్రెల కాపరులు
పూజించెను మనదేవుని యూదులకు రాజుగా

రక్షణ వచ్చెను వెలుగును తెచ్చెను
నిరీక్షణ కలిగెను ఈ లోకంలో
నిను ప్రేమించెను శాంతిని గెలిచెను
మనకొరకై జనియించెను యేసే

మనపాపము కొరకై పరలోకమహిమను
విడిచిన మన దేవుడు ప్రేమపూర్ణుడు (2)
కన్యమరియ గర్భమున పరిశుద్ధునిగా
జన్మించనేసు పాపరహితునిగా (2)
** TELUGU LYRICS **

** ENGLISH LYRICS **

-------------------------------------------------------------------
CREDITS :
-------------------------------------------------------------------