Back

Choose Song To View The Lyrics

ఉదయించే దివ్యతార ఘోరాంధకార లోకాన

ఉదయించే దివ్యతార ఘోరాంధకార లోకాన
జన్మించే క్రీస్తు యేసు రక్షణవెలుగునియ్య (2)
అందముగా క్రీస్తేసుకు హల్లెలూయ ఆని పాడెదా (2)
హల్లెలూయ ఆమెన్ ఆమెన్ హల్లెలూయ (2)
||ఉదయించే||

పరలోకతండ్రి మనలను కరుణించి పంపెను క్రీస్తు ప్రభున్
లోకందులకూ దృష్టి నివ్వ అరుదెంచే క్రీస్తు ప్రభు (2)
చీకటినుండి వెలుగునకు నడిపించ వచ్చెను రక్షకుడు
ఆ వెలుగు ప్రకాశింప ఉదయించెను ఈ ధరలో
||హల్లెలూయ|| ||ఉదయించే||

దూతలు గీతము పాడగా దర్శించే గొల్లలు
తూర్పుదిక్కున చుక్క వెలుగియ్యగా పయనించే జ్ఞానులు (2)
నశించిన వారిని వెదకి రక్షింపగ వచ్చెను యేసు
ఇమ్మానుయేలు దేవుడు మనలను నడిపించును
||హల్లెలూయ|| ||ఉదయించే||
** TELUGU LYRICS **

** ENGLISH LYRICS **

-------------------------------------------------------------------
CREDITS :
-------------------------------------------------------------------