Back

Choose Song To View The Lyrics

ఓ ప్రభుండా నిన్ నుతీంచుచున్నాము

1. ఓ ప్రభుండా నిన్ నుతీంచుచున్నాము వినయముతోడ
మా ప్రభుండ వంచు నిన్ను మానక మేమొప్పుకొందు
||ఓ||

2. నిత్యుఁడవౌ తండ్రి లోకము నిన్నారాధించుచు నుండు
సత్యదూతల్ మోక్షమందు సర్వ ప్రధానుల్ సుభక్తిన్
నిత్య మేక కంఠముతోడ నిన్ గొనియాడుచున్నారు
||ఓ||

3. పరిశుద్ధ, పరిశుద్ధ పరిశుద్ధ,సేనల దేవా
ధరపరలోకంబులు నీ వర మహిమతో నోప్పునటంచు
||ఓ||

4. కెరూబుల్ సెరూపుల్ నిన్నుఁ గీర్తించుచున్నారహహా
సారెకున్ నిన్నపొస్తలుల సంఘము స్తోత్రించుచుండు
కూరిమిన్ బ్రవక్తల సంఘము కొనియాడుచు నిన్ నుతియించు
||ఓ||

5. మా మహా జనకా నిను మాన్యుఁడౌ పుత్రున్ బహు ప్రేమగల
మా పరిశుద్ధాత్మను బ్రీతితో సంఘము భువి నొప్పుకొనున్
||ఓ||

6. నీవే క్రీస్తు రాజవు నిత్య కుమారుడవు నీ విలలో మానవులను
గావఁగఁ బూనినయపుడు పావన కన్యా గర్భంబున బుట్టుట
బహుదీనంబనక చావు శ్రమ నోడించి సజ్జనులకు దివిఁ దెరచితివే
||ఓ||

7. నీవు దేవుని కుడి పార్శ్వంబున నిత్యము మహిమాసీనుఁడవు
నీవు మా న్యాయాధిపతివై రావలయునని నమ్ముచుందుము
పావనంబౌ నీ రక్తంబున సేవకులకుఁ దోడ్పడు మిపుడే
||ఓ||
8. నిత్య మహిమములో నిఁక నీదు భక్తులతోన గత్యముగ లెక్కించుము
వారలఁ గని రక్షించుమి నీ సుజనంబున్
||ఓ||

9. నీవు దీవించి నీ నిత్య స్వాస్థ్యంబు సుజీవమిడి వారలఁ
బాలించి లేవఁగ నెత్తుము సతతము ప్రీతిన్
||ఓ||

10. ఓ ప్రభువా పాపములో నుండ కుండఁగఁ దోడ్పడుము
మా ప్రభువా కరుణించు మముఁ గరుణించుము దయతోడన్
||ఓ||

11. ఓ ప్రభుండా నిన్ను నమ్మి యున్న మాకుఁ బ్రేమఁ జూపు
శ్రీ ప్రభుండా నిన్నే నమ్మితి సిగ్గునొంద నీయకుము
||ఓ||
** TELUGU LYRICS **

** ENGLISH LYRICS **

1. O Prabhundaa Nin Nutheenchuchunnaamu Vinayamuthoda
Maa Prabhundaa Vanchu Ninnu Maanaka Maemoppukondhu
||O||

2. Nithyudhavau Thandri Lokamu Ninnaraadhinchuchu Nundu
Sathyadhoothal Mokshamandhu Sarva Pradhaanal Subhakthin
Nithya Maeka Kanthamuthoda Nin Goniyaduchunnaru
||O||

3. Parishuddha, Parishuddha Parishuddha, Saenala Dheva
Dharapara Lokambuluni Nee Vara Mahimatho Noppunatanchu
||O||

4. Keroobul Seroopul Ninnu~ Geerthinchuchunnarahaha
Saarekun Ninnaposthalula Sanghamu Sthothrinchuchundu
Koorimin Bravakthala Sanghamu Koniyaduchu Nin Nuthiyinchu
||O||

5. Maa Mahaa Janakaa Ninu Maanyudhau Puthrun Bahu Premagala
Maa Parishuddhaathmanu Breethitho Sanghamu Bhuvin Noppukonun
||O||

6. Neevae Kreesthu Raajavu Nithya Kumaarudavu Nee Vilalo Maanavulanu
Gaavaga~ Booninayapudu Paavana Kannyaa Garbhambuna ButtuTa
Bahudheenambanaka Chaavu Shrama Nodhinchi Sajjanulaku Dhivin Dherachithivae
||O||

7. Neevu Dhevuni Kudi Paarshwambuna Nithyamu Mahimaaseenudhavu
Neevu Maa Nyaayaadhipathivai Raavalayani Nammuchundhumu
Paavanambau Nee Rakthambuna Saevakulaku~ Thodhpadu Mipudae
||O||

8. Nithya Mahimamulo Ni~ka Needu Bhakthulathona Gathyamugaa Lekkinchumu
Vaarala~ Gani Rakshinchimi Nee Sujanambun
||O||

9. Neevu Dheevinchi Nee Nithya Swaasthyamubu Sujeevamidi Vaarala~
Baalinchi Laevaga~ Neththumu Sathathamu Preethin
||O||

10. O Prabhuvaa Paapamulo Nunda Kundaga~ Thodhpadumu
Maa Prabhuvaa Karuninchu Mammu~ Karuninchumu Dhayathodan
||O||

11. O Prabhundaa Ninnu Nammi Yunna Maaku~ Braemam~ Joopu
Shree Prabhundaa Ninnae Nammithi Siggunondha Neeyakumu
||O||

-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------