Back

Choose Song To View The Lyrics

ప్రభుయేసే నిజ ద్రాక్షావల్లి (సీయోను పిల్లల పాటలు)/ Prabhu Yese Nija Drakshavalli

నేను నిజమైన ద్రాక్షావల్లిని…. యోహాను 15:1

1. ప్రభుయేసే నిజ ద్రాక్షావల్లి – ఆయనలో నేనొక తీగెను    (2)

    ఆయనకు వేరుగా నేను – ఏమియు చేయలేను           (2)

    పనికిరాని వన్నిటిని – తీసివేయనిచ్చెదను                (2)

    అధికముగా ఫలించెదను – తండ్రికి మహిమ కలుగుటకె (2)     ॥ప్రభు॥

2. ఆత్మలో ఆనందించుచు – ఫలియించెదనే నీ ఫలమున్

    ప్రేమ సంతోషము సమాధానం – దీర్ఘశాంత దయాళుత్వము

    మంచితనము విశ్వాసము – సాత్వికము ఆశానిగ్రహమున్                 ॥ప్రభు॥

3. ప్రభువునకు తగినట్లుగా – నడిచెదను ప్రతి విషయములో

    మారు మనస్సుకు తగినట్లుగా – అత్యధికముగా ఫలియించెదను     ప్రభువు కృపలో ఎదిగెదను – ప్రభు రాకను నిరీక్షించుచు                   ॥ప్రభు॥