Back

Choose Song To View The Lyrics

మేమే మేమే యేసుక్రీస్తు బిడ్డలం / Meme Meme Yesu Kreesthu Biddalam

మేమే మేమే యేసుక్రీస్తు బిడ్డలం

మేమే మేమే క్రీస్తుకు

ప్రియ వారసులం

పువ్వులం దివ్వెలం

బలిపీఠపు గువ్వలం

1 ఐదువేల మందికి సంతృప్తిని ఇచ్చిన

యేసు విరచి ఇచ్చినట్టి

ఐదు రొట్టె చేపలం

ఐదు రొట్టెలం రెండు చిన్ని చేపలం

2. కానా విందులో

ఆత్మ దాహమును తీర్చిన

యేసు ఆశీర్వదించినట్టి

రాతి బానలం ఆరు రాతి బానలం