Back

Choose Song To View The Lyrics

బంగారు నగరిలో నా కొరకు / Bangaaru Nagarilo Naa Koraku

బంగారు నగరిలో నా కొరకు

ఇల్లు కట్టెను నా యేసు రాజు

సుందరమైన నగరం

రత్నాల రాశుల పరమపురం

1. తానుండె చోటుకు కొనిపోవుటకును

రానుండె నా యేసురాజు

బాధలు లేని నగరం

రోదన ఎరుగని పరమపురం

2. నీవును యేసుని అంగీకరించిన

కట్టును నీకు ఇల్లు

ఆకలి లేని నగరం

చీకటి కానని పరమపురం