Back

Choose Song To View The Lyrics

పరిశుద్ధ జనమా పరలోక జనమా

- జి.నిరీక్షణ్ రావు

పరిశుద్ధ జనమా - పరలోక జనమా
వరుడు యేసునికి - వధువైన జనమా
ధరయందు పరమందు క్రీస్తేసే - సర్వ పరిపూర్వ దైవాత్మ నరుడే

1. యేసే సర్వమును - యేసే అధికారి
యేసే సృష్టికి - ఆది సంభూతుడు
యేసే ఇలలో - యేసే దైవం
యేసే జ్ఞానం - యేసే దైవం
||పరిశుద్ధ||

2. యేసుని పోలికలో - సాగించు నీ పయనం
దాసునిగ - అర్పించుము సర్వము
యేసే మనకు - జీవిత గమ్యం
భాసురంబగు - క్రైస్తవ జనమా
||పరిశుద్ధ||

3. శ్రమల ద్వారా - సంపూర్ణత నాశించుము
సమర్పణతో పరిచర్య చేయుము
ప్రేమతోడ - సహనము తోడ
సమతా మమతలు - నిలుపుము ఇలలో
||పరిశుద్ధ||

4. ఎవరు ఏమన్నా - ఎదురేమి నీకున్న
వెనుతిరిగి - చూడకు క్రైస్తవమా
ప్రభుని చిత్తము - నెరవేర్చుటలో
ప్రభువు తోడుగ - ఉన్నాడు ఎపుడు
||పరిశుద్ధ||
** TELUGU LYRICS **

** ENGLISH LYRICS **

---------------------------------------------------
CREDITS : Vidhyardhi Geethavali
---------------------------------------------------