Back

Choose Song To View The Lyrics

నూతన యెరూషలేము పట్టణము పెండ్లికై అలంకరింపబడుచున్నది

నూతన - యెరూషలేము పట్టణము
పెండ్లికై - అలంకరింపబడుచున్నది

దైవనివాసము మనుషులతో - కూడా ఉన్నది
వారాయనకు - ప్రజలై యుందురు
ఆనంద - ఆనంద - ఆనందమే
||నూతన||

ఆదియు నేనే - అంతము నేనై యున్నాను
దుఃఖము లేదు - మరణము లేదు
ఆనంద - ఆనంద - ఆనందమే
||నూతన||

అసహ్యమైనది - నిషిద్ధమైనది చేయువారు
ఎవ్వరు దానిలో - లేనేలేరు
ఆనంద - ఆనంద - ఆనందమే
||నూతన||

దేవుని దాసులు - ఆయనను సేవించుదురు
ముఖ దర్శనము - చేయుచునుందురు
ఆనంద - ఆనంద - ఆనందమే
||నూతన||

సీయోనులో - గొర్రెపిల్లయే మూలరాయి
సీయోను పర్వతము - మీదయు ఆయనే
ఆనంద - ఆనంద - ఆనందమే
||నూతన||

-------------------------------------------------------------------------
CREDITS : హోసన్నా మినిస్ట్రీస్ (Hosanna Ministries)
-------------------------------------------------------------------------
** TELUGU LYRICS **

** ENGLISH LYRICS **