Back

Choose Song To View The Lyrics

క్రీస్తు మన కొరకు పుట్టినాడురో రక్షణ మన కొరకై తెచ్చినాడురో

క్రీస్తు మన కొరకు పుట్టినాడురో
రక్షణ మన కొరకై తెచ్చినాడురో
బెత్లెహేములో జన్మించినాడురో
నజరేతు లోకమును విడిపించినాడురో (2)
సర్వలోకమా ఆనందించుమా
సర్వలోకమా సంతోషించుమా (2)

జ్ఞానులు గొల్లెలు ఆయనను వెతుకుచుండిరి
ఆయనను కనుగొని పూజింప సాగిరి
జ్ఞానులు గొల్లెలు ఆయనను వెతుకుచుండిరి
ఆయనను కనుగొని పూజింప సాగిరి
ప్రవక్తల వాక్కులు నెరవేర్చబడేనే
సర్వజనులకు శుభ వర్తమానమే
సర్వలోకమా ఆనందించుమా
సర్వలోకమా సంతోషించుమా
పరిశుద్ధుడు పరిశుద్ధుడు
మానకొరకై పుట్టినాడు

రాజ్యము నీతిని మొదటగా వెతుకు వారులు
ఆయనతో ఉందురు నిత్యజీవములో
పాపుల కొరకు వచ్చియుండెనే
రక్షణతో మనలను కొనిపోవునే
సర్వలోకమా ఆనందించుమా
సర్వలోకమా సంతోషించుమా
** TELUGU LYRICS **

** ENGLISH LYRICS **

-------------------------------------------------------------
CREDITS : Music : Dr.Kenny Chaitanya
Lyrics, Tune & Vocals : Bro David
-------------------------------------------------------------