ఏమి ఏమి ఇంత చిత్రమో / Yemi Yemi Intha Chithramo

ఏమి ఏమి ఇంత చిత్రమో

ఓ చిన్నారి

లోకమంతా ఎంత చిత్రమో

ఓ పొన్నారి

అ.ప.: అవునులే అనినంతనే

కలిగెలే లోకమింతగా

అంతయు మంచి మంచిగ

దేవుడే చేసెనింతగా

అంతయు వింతగా చేసెలే

మరి ఎంతయో వింతగా తోచెలే

1. వెలుగు కలిగె మొదటి రోజున ఓ చిన్నారి

నింగి గాలి రెండో రోజున ఓ పొన్నారి

నేల నీరు చెట్టు చేమలు ఓ చిన్నారి

ప్రభువు చేసే మూడో రోజున ఓ పొన్నారి

2. సూర్య చంద్ర తారలన్నియు ఓ చిన్నారి

ప్రభువు చేసే నాల్గో రోజున ఓ పొన్నారి

చేప పక్షి జాతులన్నియు ఓ చిన్నారి

ప్రభువు చేసే ఐదో రోజున ఓ పొన్నారి

3 మృగములు ఆదామవ్వలు ఓ చిన్నారి

ప్రభువు చేసే ఆరో రోజున ఓపొన్నారి

సృష్టినంత చూచి దేవుడు ఓ చిన్నారి

ఏడో రోజు విశ్రమించెనే ఓ పొన్నారి

అంతయు సృష్టి అంతయు

హాయిగా పూర్తియాయెనే

అందుకే ఆదివారము నిలిచెనే అ

పూజ దినముగా

అంతయు వింతగా తీరెలే మరి అ

ఎంతయో వింతగా తోచెలే

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top