పాత క్రొత్త నిబంధనలందున (సీయోను పిల్లల పాటలు) / Patha krotha nibandanalanduna

… వచనముల భావము వారికి తెలిపెను. లూకా 24:27

1. పాత క్రొత్త నిబంధనలందున – అరవైయారు పుస్తకముల్

    పేర్లు తెలియవలెననిన – దైవ కృపచే విభజించి పాడ వలయున్

2. పాత నిబంధన యందలి గ్రంథముల్-ముప్పది తొమ్మిదియు

    మరి క్రొత్త నిబంధన – యందున ఇరవై-ఏడు పుస్తకములును

3. ఆదికాండము, నిర్గమకాండము, లేవీయుల కాండము,

    సంఖ్యా, ద్వితీయోపదేశ కాండముల్, యెహోషువ,

    న్యాయాధి పతులు, రూతు

4. మొదటి సమూయేలు, రెండు సమూయేలు

    మొదటి రెండు రాజులును

    మరి ఒకటి రెండు దినవృత్తాంతములును, ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేరు,

5. యోబు, కీర్తనలు, సొలొమోను సామెతల్, ప్రసంగి, పరమ గీతము

    యెషయా, యిర్మీయా, విలాపములు, యెహెజ్కేలు,

    దానియేల్, హోషేయా, యోవేలు,

6. ఆమోసు, ఓబద్యా, యోనా, మీకా, నహూము, మరి హబక్కూకు,

    జెఫన్యా, హగ్గయి, జెకర్యా, మలాకీ, చెప్పితి ముప్పై తొమ్మిది

7. మత్తయి, మార్కు, లూకా, యోహాన్, అపొస్తలుల కార్యములు,

    రోమా, ఒకటి, రెండు కొరింథీయులు, గలతీయ, ఎఫెసీయులు

8.  ఫిలిప్పీయు, కొలొస్సయు, ఒక థెస్సలోనికైయ,

    రెండు థెస్సలోని కైయులు

    ఒకటి, రెండు తిమోతి పత్రికలును – తీతు, ఫిలేమోన్ పత్రిక,

9. హెబ్రీయులును, యాకోబు, పేతురు – ఒకటి, రెండు పత్రికలన్

    యోహాను వ్రాసిన పత్రికలు మూడును – యూదా, ప్రకటనయు

10. అరవై ఆరును దేవుని చేత – నీయబడిన వేదము

     దాని మోకాళ్ళ మీద ప్రార్థన తోడ – అనుదినము చదువుడి

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top