తెల్లారింది వేళ త్వరగా నిద్దుర లేదా /Thellarindi Vela Thwaragaa Niddura Leda

తెల్లారింది వేళ త్వరగా నిద్దుర లేదా

మనమంతా ఆయన సృష్టేరా

పక్షుల కోలాహ వేళ

ప్రభువును స్తుతించవేరా

వాటికంటే శ్రేష్టులు మనమేరా

1. అడవిరాజు సింహమైనను

ఆకలంటు పిల్లల్లన్నను

యేసు రాజు పిల్లలం మనం

పస్తులుంచునా

వాడిపోవు అడవి పూలకు

రంగులేసి అందమిచ్చెను

రక్తమిచ్చి కొన్న మనలను

మరచిపోవునా

2. చిన్నదైన పిచ్చుకైనను

చింతవుందా మచ్చుకైనను

విత్తలేదు కోయలేదని

కృంగిపోవునా

వాటికన్ని కూర్చువాడు

నీ తండ్రి యేసేనని

నీకు ఏమి తక్కువ కాదని

నీకు తెలియునా

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top